బెట్టింగ్‌కు మరో యువకుడి బలి

HYD: మేడ్చల్ జిల్లాలో మరో యువకుడు బెట్టింగ్ భూతానికి బలయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మేడ్చల్ PS పరిధి గౌడవెల్లికి చెందిన యువకుడు రాహుల్ IPL బెట్టింగ్‌లో నష్టపోయి మనస్తాపంతో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఇంటర్ వరకు చదువి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై, అప్పులు చేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.