అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లపూజ
AP: దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం అలిపిరి పాదాలమండపం వద్ద జరిగింది. టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు కలిసి మెట్లపూజ నిర్వహించారు. పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని చెప్పారు.