కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి కోమటిపల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కోటిపల్లి గ్రామానికి కొత్తగా 40 రేషన్ కార్డులు మంజూరు కావడంతో లబ్ధిదారులకు అందజేశారు. 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, సుకుమార్, గట్టు పాల్గొన్నారు