ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

BDK: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బూర్గంపహాడ్ మండలంలోని టేకులచెరువులో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో ఇవాళ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఉప్పుసాక పంచాయతీలోని రాజీవ్ నగర్‌కు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.