30వ సారి రక్తదానం చేసిన వ్యక్తి

30వ సారి రక్తదానం చేసిన వ్యక్తి

VZM: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో గజపతినగరానికి చెందిన సాయిబాబా మెడికల్ షాప్ యజమాని కెఏఎస్ఎస్ గుప్త 30వ సారి రక్తదానం చేశారు. ఈ మేరకు ఆయనను పలువురు అభినందించారు.