'గ్యాస్ నిల్వలకు ఢోకా లేదు.. పుకార్లు నమ్మకండి'
VSP: విశాఖ జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. గృహ అవసరాలకు గ్యాస్ పంపిణీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఎటువంటి పుకార్లను నమ్మవద్దని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు విజ్ఞప్తి చేశారు.