విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

W.G: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్య పాలెం వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌ను వ్యాన్‌లో తరలిస్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా ఇరగవరం మండలానికి చెందిన కె. సింహాద్రి అప్పన్న (58), జి. సందీప్ (26) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.