మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
NLG: చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో దేశపాక శ్రీశాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జ్వాలా యూత్ సభ్యుడిగా ఉన్న శ్రీశాంత్ మృతికి సభ్యులు సంతాపం తెలుపుతూ... ఇవాళ కుటుంబ సభ్యులను కలిశారు. మృతుడి తల్లిని పరామర్శించి, యూత్ అసోసియేషన్ తరపున రూ. 20,000ల ఆర్థిక సహాయాన్ని అందించి మనోధైర్యాన్ని కలిగించారు.