ఇష్టానుసారంగా అటవీశాఖ అధికారుల తీరు
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ బడే నాగజ్యోతి అటవీశాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలున్నా గిరిజన పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లిలో గిరిజన పోడు రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీయడం సరికాదని, ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.