యువకుడి అనుమానస్పద మృతి

యువకుడి అనుమానస్పద మృతి

SRCL: వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్‌లో ఓ లాడ్జిలో యువకుడు మృతి చెందిన సంఘటన నెలకొంది. మృతుడు వీర్నపల్లి మండలం అడవి పందిర గ్రామానికి చెందిన భూక్యమోహన్ (26)గా పోలీసులు గుర్తించారు. అతను లాడ్జీలో రూమ్ కోసం వచ్చి కాసేపటికే రూంలో  విగతజీవిగా పడి ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.