రైతన్న కోసం ప్రోగ్రాంతో రైతులకు అండగా ప్రభుత్వం
KRNL: రైతన్న కోసం కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని TDP రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరు మండలం హనుమాపురంలో రైతు కోసం కార్యక్రమం నిర్వహించారు. స్తానిక టీడీపీ నేతలు ఈరన్న, రాజశేఖర్‌తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి రైతులను కలిసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జరిగిన లబ్ధిని వివరించారు.