గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలా శాసనమే: సీఎం

HYD: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే అని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన సర్వే చేశామని, కులగణన సర్వేలో తప్పులు ఉంటే చూపాలని రాజకీయ పార్టీలకు సవాలు విసిరామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణను తప్పు పట్టవద్దన్నారు.