ఈనెల 28న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం
VSP: విశాఖలో ఈ నెల 28న జీవీఎంసీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. అజెండా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కార్యవర్గం పదవీకాలం వచ్చే నెల 17తో ముగియనున్నందున, ఇది చివరి సమావేశంగా ఉండనుంది. ప్రతి సభ్యుడు మాట్లాడేలా రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు.