పది దాటినా తెరవని వ్యవసాయ కార్యాలయం

పది దాటినా తెరవని వ్యవసాయ కార్యాలయం

సత్యసాయి: నల్లమాడ రైతు సేవ కేంద్రాన్ని మండల వ్యవసాయ కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. శుక్రవారం మండల వ్యవసాయ అధికారి, సిబ్బంది 10:30గంటలు అవుతున్న కార్యాలయానికి తలుపులు తెరవలేదు. దీంతో ఉదయం నుంచి రైతులు తమ పనులపై కార్యాలయానికి వచ్చి తలుపులు తెరచకపోవడంతో వెనుతిరిగిపోతున్నారు. దీని పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.