పంపింగ్ స్టేషన్ల మెరుగుదలపై కమిషనర్ ఆదేశం
VSP: విశాఖ జీవీఎంసీ పరిధిలోని నీటి పంపింగ్ స్టేషన్ల నిర్వహణను మెరుగుపరచాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరాలో నిత్యం నాణ్యతా పరీక్షలు చేయాలని ఆయన సూచించారు. ఆయన జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్ శేషాద్రిలతో కలిసి జోన్-6, గాజువాకలోని 10 ఎంజీడీ కెపాసిటీ పంపింగ్ స్టేషన్‌ను పరిశీలించారు.