VIDEO: 'ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి'
WNP: పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.