VIDEO: ఇంట్లో చోరీ.. 13 తులాల బంగారం స్వాహా

VIDEO: ఇంట్లో చోరీ.. 13 తులాల బంగారం స్వాహా

VZM: రేగిడి మండలం బాలకవివలస గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. కిలారి కమల తన భర్తతో పొలం పనుల కోసం వెళ్లేందుకు ఇంటికి తాళం వేశారు. ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని 13 తులాల బంగారం దొంగతనానికి గురైనట్లు గ్రహించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.