పేలుడు ఘటనపై జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆందోళన
KRNL: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనలో 23 మంది కార్మికులు సజీవ దహనమవడం తీవ్ర విషాదం కలిగించిందని జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేశారు.