'దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
సత్యసాయి: పుట్టపర్తిలో నిర్వహించిన దివ్యాంగుల సంక్షేమ అవగాహన సమావేశంలో ముఖ్య అతిథులు రూ. 63.45 లక్షల బ్యాంకు లింకేజీ రుణాల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించారు. దివ్యాంగుల ఆటల పోటీల్లో విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రీవెన్స్, సర్టిఫికెట్ రీ–వెరిఫికేషన్, UDID కార్డుల జారీపై కలెక్టర్ సూచించారు.