VIDEO: సంగమేశ్వరునికి అమావాస్య ప్రత్యేక అలంకరణ

VIDEO: సంగమేశ్వరునికి అమావాస్య ప్రత్యేక అలంకరణ

SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయంలో ఇవాళ అమావాస్య విశేష పూజలు నిర్వహించారు. చైత్రమాసం, కృష్ణపక్షం చివరి రోజు సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి, సుగంధ పుష్పాలతో అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చన సహస్రనామాలతో మహా మంగళహారతి, నైవేద్యం సమర్పించారు.