భక్తుల సౌకర్యార్థం రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు

భక్తుల సౌకర్యార్థం రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు

NLG: నార్కట్ పల్లి మండలం శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి గుట్టపైకి భక్తులు వచ్చేందుకు రహదారి పక్కన గల దేవస్థానం ఆర్చి వద్ద ఆర్టీసీ వారు రిక్వెస్ట్ బస్ స్టాప్ సౌకర్యాన్ని కల్పించినట్లు దేవాలయ ఛైర్మెన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. నిత్యం వచ్చే భక్తులతో పాటు, మాస కల్యాణం, సుదర్శన హోమం, ఇతర ప్రత్యేక రోజుల్లో వచ్చే వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.