గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ లో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపట్టినట్లు మండల పశువైద్యాధికారి లక్ష్మీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశువులలో గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలను ఈ రోజు నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించడం జరుగుతుందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు.