చెట్టును ఢీకొట్టిన గ్యాస్ సిలిండర్ల వ్యాన్

చెట్టును ఢీకొట్టిన గ్యాస్ సిలిండర్ల వ్యాన్

కొడవలూరు మండలం చదివేంద్ర గ్రామ సమీపంలో శనివారం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వ్యాను రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు.. గ్యాస్ సిలిండర్ల వ్యాను పక్కనే ఉన్న ద్విచక్ర వాహనానికి తగిలి చెట్టుని ఢీకొంది. వ్యాను డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కింద పడ్డ సిలిండర్‌లు పేలకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.