హాస్టల్‌లోనే విద్యార్థినికి పురిటి నొప్పులు..!
KDP: జిల్లాలోని మరియాపురం గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్‌లో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్‌లో నివసిస్తున్న పారా మెడికల్ రెండో సంవత్సరం విద్యార్థినికి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికను వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.