రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

SRD: పంచాయతీ రాజ్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించడం లేదని, అది జీవో 46కు విరుద్ధమని జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా, కేవలం 117 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసినట్లు సమాచారం.