ఫిలింనగర్‌లో మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్

HYD: మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు, భారీ జరిమానాలు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫిలింనగర్ అపోలో ఆసుపత్రి చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 25 మందికి పైగా మైనర్లను పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.