పశువులను తరలిస్తున్న బొలెరో వాహనం పట్టివేత
KMR: బీర్కూర్‌లోని అన్నారం బస్టాండ్ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా 8 పశువులను తరలిస్తున్న ఒక బొలెరో వాహనం పట్టుబడింది. ఈ ఘటనపై ఎస్సై మహేందర్ మాట్లాడుతూ.. మూగజీవాలను అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. అనుమతులు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.