స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల భారీ ర్యాలీ

VSP: విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళన రోజురోజుకీ మరింత ఉదృతం అవుతోంది. కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాలనుంచి తొలగించడం వంటి అంశాలపై కార్మికులు నిరసనలు చేస్తున్నారు. విధుల నుండి తొలగించిన స్టీల్‌ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాత గాజువాక నుండి కొత్త గాజువాక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.