'కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి'
ADB: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని నూతన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ సూచించారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై ఆదివారం జిల్లాకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూల బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. నాయకులు సంతోష్ రావు, ప్రవీణ్ రెడ్డి, విట్టల్, లక్ష్మణ్, అజయ్, శ్రీలేఖ తదితరులున్నారు.