విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
KNR: చొప్పదండి మండలం ఆర్నకొండ జడ్పీహెచ్ఎస్‌లో మంగళవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 95 మందికి పరీక్షలు చేయగా, 14 మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు తెలిపారు. హెచ్ఎం శ్రీనివాస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆప్తమాలజిస్ట్ సురేష్, ఫార్మసిస్ట్ రాజశేఖర్, ఏఎన్ఎం స్వప్న, తదితరులు పాల్గొన్నారు.