వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కోనసీమ: ప్రజలందరూ ఆనందోత్సవాలతో వినాయక చవితి పండుగ నిర్వహించుకోవాలనీ రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. వినాయకచవితి పండగ సదర్భంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాధుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు.