హిందూ కార్తీక వన భోజన కార్యక్రమం
KDP: నగరంలోని రాజంపేటకు వెళ్లే మార్గంలో హిందూ కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హిందువులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సామూహిక హిందూ వన మహోత్సవ భోజన కార్యక్రమంతో పాటు కళ్యాణం చేపట్టారు. కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళ భక్తులకు కుంకుమను అందజేశారు.