రాష్ట్రస్థాయికి ఎంపికైన లింగంపేట్ విద్యార్థి
KMR: లింగంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి మహిపాల్ జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో గెలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. మాచాపూర్‌లో జరిగిన అండర్ 14/17 కుస్తీ పోటీ టోర్నమెంట్‌లో జిల్లాస్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ నరేందర్, అధ్యాపకులు అతన్ని అభినందించారు.