మర్రిపూడిలో తీవ్ర ఉద్రిక్తత

మర్రిపూడిలో తీవ్ర ఉద్రిక్తత

ప్రకాశం: మర్రిపూడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ సొంతనిధులతో మర్రిపూడిలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ఆ విగ్రహాలను తామే ప్రారంభిస్తామంటుండగా, మా సొంత నిధులతో ఏర్పాటు చేసిన విగ్రహాలను మీరెలా ప్రారంభిస్తారంటూ వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.