రాహుల్‌కు బీజేపీ ఎంపీ భార్య కౌంటర్
ది కేరళ స్టోరీ-2 మూవీపై కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి కౌంటర్ ఇచ్చారు. ఇంటి వద్ద కూర్చుని విమర్శలు చేసే కంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఇది ప్రచార చిత్రమా లేక సమాజానికి అద్దం పట్టే వాస్తవమా అనేది అర్థమవుతుందంటూ చురకలంటించారు. హిందూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులకు ఈ మూవీ నిదర్శనమని చెప్పారు.