సీఎంపై మండిపడ్డ జిల్లా వైసీపీ నేత
NTR: జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి బుర్రి ప్రతాప్ 'మావిగన్' రాష్ట్ర అభివృద్ధికి మంత్రమని చెప్పుకొచ్చారు. దీనికి వస్తున్న ప్రజామోదాన్ని చూసి చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే వారికి అనుకూల మీడియా సంస్థలు ట్రోలింగ్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అమరావతి ఇప్పుడప్పుడే పూర్తి కాదని, మాట తప్పిన చంద్రబాబు నవ నగరాల హామీ ఏమైందో ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు.