MLA సార్.. మీరైనా స్పందిస్తారా..?: గ్రామస్థులు
MBNR: మహమ్మదాబాద్ (M)లో ఇవాళ నవజీవన రి-క్రియేషన్ క్లబ్ వద్ద వివాదాస్పద నిర్మాణంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు భారీగా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గుళ్ల చెన్నయ్య మాట్లాడుతూ.. వెటర్నరీ ఆసుపత్రిని బదిలీ చేయడమే కాక బిల్డింగ్‌ను కూల్చేశారు. ఇప్పటికైన ఎమ్మెల్యే స్పందిస్తారా లేదా అంటూ ప్లకార్డులతో స్థానికులు నిరసన తెలిపారు.