278B డాలర్ల రక్షణ బడ్జెట్‌కు చైనా ఆమోదం
తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ 278 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏడు శాతం ఎక్కువ కావటం గమనార్హం. అమెరికా సైన్యానికి దీటుగా ఈ రక్షణ బడ్జెట్‌ను రూపొందించినట్లు నిపుణులు భావిస్తున్నారు.