జలకల సంతరించుకున్న వెలిగల్లు

జలకల సంతరించుకున్న వెలిగల్లు

అన్నమయ్య: వెలుగల్లు ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 4.64 టీఎంసీలు కాగా, సోమవారం 4.14 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 130 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుంది. ఈ మేరకు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 110 క్యూసెక్కులు, రాయచోటి, గాలివీడుకు మంచినీటి కోసం 6 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.