ధర్మవరంలో 3 రోజులు నీటి సరఫరా బంద్

ధర్మవరంలో 3 రోజులు నీటి సరఫరా బంద్

సత్యసాయి: ధర్మవరం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే తంబాపురం వాటర్ వర్క్ కేంద్రంలో కొత్త మ్యాన్ఫోల్డ్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ సాయికృష్ణ తెలిపారు. ఈ పనుల కారణంగా ఈ నెల 20, 21, 22 తేదీల్లో ధర్మవరం పట్టణానికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని సహకరించాలని ఆయన కోరారు.