VIDEO: MEOలపై అసత్య ప్రచారాలు తగవు

VIDEO: MEOలపై అసత్య ప్రచారాలు తగవు

ప్రకాశం: కనిగిరి మండల విద్యాశాఖ అధికారులపై AP టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చేసిన ఆరోపణలు అసత్యాలని టీచర్స్ గిల్డ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్రెడ్డి అన్నారు. కనిగిరిలో ఆదివారం మాట్లాడిన ఆయన.. MEOలు ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు. జీతాల బిల్లుల విషయంలో ఎవరినీ ఇబ్బందులు పెట్టలేదని అన్నారు. జిల్లా కమిటీ దీనిపై ఖండన ఇవ్వాలన్నారు.