నూతన ఎస్సైగా హుస్సేన్ బాధ్యతల స్వీకరణ
NGKL: అచ్చంపేట పట్టణ నూతన ఎస్సైగా సద్దాం హుస్సేన్ శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన విజయభాస్కర్ నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా, పదర మండలంలో ఎస్సైగా ఉన్న సద్దాం హుస్సేన్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.