పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు

PPM: కురుపాంమండల కేంద్రంలోని పలు వీధుల్లో శనివారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. బస్టాండ్, ప్యాలెస్ వీధి, శోభలతాదేవి కాలనీ, గౌడు వీధి, గాంధీ నగర్ కాలనీల్లో సుమారు పది మంది వరకు స్థానికులకు పిచ్చి కుక్క కాటు వేయటంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం వెళ్లారు.