పీజీఆర్‌ఎస్‌కు 405 అర్జీలు
TPT: తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 405 అర్జీలు స్వీకరించారు. అర్జీలకు నాణ్యమైన, వేగవంతమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.