VIDEO: పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల పంచాయతీలోని అమ్మోరు తోపు సెంటర్ వద్ద ఉన్న ఇరిగేషన్ సెంట్రల్ ఛానల్ పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు పూడిక తీత పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరిశీలించారు. పూడిక తీత పనులు సక్రమంగా చేయాలని నీటి సంఘ సభ్యులకు సూచించారు. పూడిక తీత పనుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.