'ఘాట్ రోడ్డులో రక్షణ గోడ నిర్మించాలి'
PPM: పాచిపెంట మండలం పి. కొనవలస చెక్ పోస్ట్ నుంచి ఒడిశా వెళ్ళే ఘాట్ రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలని సీపీఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఘాట్ రోడ్డు వద్ద నిరసన తెలిపారు. ఘాట్ రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయని, మలుపులు వద్ద ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు.