ఆర్టీసీ కార్మిక సంఘాలు.. నేడు బంద్‌కు పిలుపు

ఆర్టీసీ కార్మిక సంఘాలు.. నేడు బంద్‌కు పిలుపు

HNK: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేట డిపోకు చెందిన కార్మికుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు.