ప్రేమికుడి మృతి, ఘటన ఆలస్యంగా వెలుగులోకి
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం విషాదానికి దారితీసింది. వాజేడు మండలం కృష్ణాపురానికి చెందిన సతీశ్, కొంగాలకు చెందిన యువతి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న కారణంతో అటవీ ప్రాంతంలో పురుగుమందు తాగారు. ఈ ఘటనలో సతీశ్ అక్కడికక్కడే మృతి చెందగా, యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.