VIDEO: నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్
HYD: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీస్‌ల నుంచి ఐటీ ఉద్యోగులు ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.