VIDEO: జీవోను రద్దు చేయాలని కమిషనర్‌కు వినతి
HYD: బార్&రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర బార్ & రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ అన్నారు. ఈ విషయంపై నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. రిజిస్ట్రీ తప్పనిసరి నిబంధన వల్ల ఇబ్బందులు పడుతున్నామని, స్టాక్ సరఫరా కూడా ఆగిపోయిందని ఆయన అన్నారు.